Kanipakam: ఆన్‌లైన్ ద్వారా వినాయక స్వామివారి సేవలు ప్రారంభం
Kanipakam: కాణిపాకం దేవస్థాన సేవలు, దర్శన టికెట్లు, ప్రసాదాలను అధికారిక వెబ్‌సైట్ మరియు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆన్‌లైన్‌లో పొందవచ్చని అధికారులు తెలిపారు.
Kanipakam: ఆన్‌లైన్ ద్వారా వినాయక స్వామివారి సేవలు ప్రారంభం
కాణిపాకం: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం ఆలయానికి వచ్చేభక్తులకు వివిధ సేవలుకోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఆలయ ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణి నాయుడు సోమవారం ప్రకటనలో తెలియజేశారు.
భక్తుల సౌకర్యార్థం దర్శనం, ఆర్జిత సేవలు/ప్రత్యక్ష సేవలు, ప్రసాదములు మరియు పరోక్ష సేవలు ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://tms.ap.gov.in/#/temple-details/VVSKPK Mana Mitra Whatsapp Governance 9552300009 ద్వారా:
.దర్శనం టికెట్లు
.ఆర్జిత సేవలు / .ప్రత్యక్ష సేవలు
-ప్రసాదములు
-పరోక్ష సేవలు
భక్తులు ఈ ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవలసినదిగా తెలిపారు.
Next Story




