Kanipakam: కాణిపాకం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పాలకమండలి కీలక నిర్ణయాలు
Kanipakam: కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ 2026 బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పాలకమండలి సమీక్ష. బంగారు రథోత్సవ టికెట్ ధర, మోదక ప్రసాదానికి ఆమోదం.
Kanipakam: కాణిపాకం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పాలకమండలి కీలక నిర్ణయాలు
కాణిపాకం: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంకార్యనిర్వహణాధికారి కార్యాలయంలోని మీటింగ్ హాలులో గురువారం పాలకమండలి సమావేశంనిర్వహించారు.దేవస్థానం చైర్మన్ శ్రీ మణి నాయుడు, కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీ పెంచల కిషోర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సమావేశంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు, వివిధ పనుల టెండర్లు, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.ప్రతి నెల సంకష్టహర చతుర్థి సందర్భంగా నిర్వహించే బంగారు రథోత్సవ సేవ టికెట్ ధరను రూ.5,000గా నిర్ణయిస్తూ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది.అలాగే భక్తులకు మోదక ప్రసాదం అందించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది.
క్యూలైన్లలో వేచి ఉండే భక్తులు, మాడా వీధుల్లో సంచరించే భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు కొత్త సిబ్బందిని నియమించుకోవాలని నిర్ణయించారు.2026 వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టనున్న ఇంజనీరింగ్ శాఖ అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లకు కూడా సమావేశంలో ఆమోదం తెలిపారు.




