Kanipakam: కాణిపాకం దేవస్థానం పాలకమండలి సమావేశం
Kanipakam: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం పాలకమండలి సమావేశం. బంగారు రథోత్సవ సేవ టికెట్ ధర రూ.5,000 నిర్ణయం.
Kanipakam: కాణిపాకం దేవస్థానం పాలకమండలి సమావేశం
కాణిపాకం: శ్రీ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణధికారి కార్యాలయం మీటింగ్ హాలు నందు ఈరోజు పాలకమండలి సమావేశం నిర్వహించడం జరిగింది, చైర్మన్ శ్రీ మణి నాయుడు గారు, దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్ గారు, అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించడం జరిగింది, మొదటి అంశం 2026 సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు దగ్గరికి రావడంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, టెండర్లు, ఇంకా ముఖ్య అంశాలపై చర్చించడం జరిగింది, సంకష్టహర చతుర్థి ప్రతినెల బంగారు రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది.
కావున బంగారు రధోత్సవ సేవ ఒక టికెట్ ధర 5,000 రూపాయలు ధర నిర్ణయిస్తూ బోర్డు ప్రతిపాదనలను తీసుకోవడం జరిగింది, తరువాత మోదక ప్రసాదాన్ని భక్తులకు అందించే విధంగా ధర్మకర్తల మండలి ఆమోదం తెలపడం జరిగింది, క్యూ లైన్ లో వేచియుండు భక్తులకు, మరియు మాడా వీధులలో తిరుగు భక్తులకు త్రాగునీరు అందజేయుటకు నూతనంగా సిబ్బందిని నియమించుకోనడానికి దేవదాయ శాఖ వారు సూచనలు జారీ చేశారు.
2026 వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఇంజనీరింగ్ శాఖ టెండర్లకి ఆమోదం తెలుపుతు, ఇంకా వివిధ ముఖ్య అంశాలపై సుదీర్ఘ చర్చలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డీఈఓ సాగర్ బాబు, ఇన్చార్జి ఈ.ఈ సతీష్, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు నాగరాజు నాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శివ ప్రసాద్, నరేష్, సతీష్, సుబ్రహ్మణ్యం రెడ్డి, చంద్రకళ, అనసూయ, వసంత, సునీత, రాజ్యలక్ష్మి, కృష్ణవేణి, పద్మలత, ఏఈఓ లు ప్రసాద్, ఎస్వీ కృష్ణారెడ్డి, హరి మాధవరెడ్డి, ధనంజయ, ధనపాల్, సిఎఫ్ఓ నాగేశ్వరరావు, సూపర్డెంట్లు కోదండపాణి, ఇంజనీరింగ్ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.




