Kanipakam: కాణిపాకం ఈశ్వరాలయంలో ఘనంగా శాకాంబరి ఉత్సవాలు
Kanipakam: కాణిపాకం ఈశ్వరాలయంలో గురు పౌర్ణమి వేళ వైభవంగా శాకాంబరి ఉత్సవాలు. కూరగాయలు, పండ్ల అలంకరణలో దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లు: ఈవో పెంచల కిషోర్.
Kanipakam: కాణిపాకం ఈశ్వరాలయంలో ఘనంగా శాకాంబరి ఉత్సవాలు
కాణిపాకం: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అనుబంధ ఆలయమైన ఈశ్వరాలయం నందు శాకాంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు.
గురు పౌర్ణమి రోజున ఈశ్వరాలయం నందు స్వామి అమ్మవార్లను వివిధ రకాల కూరగాయలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు ఆలయ అర్చకులు అందించారు.
శివాలయం ప్రాంగణమంతా రకరకాల కూరగాయలతో, పండ్లతో అలంకరించి భక్తులను ఆకట్టుకునే విధంగా చూడముచ్చటగా ఉండే విధంగా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ యువ పెంచల కిషోర్, ఆలయ చైర్మన్ మనీ నాయుడు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
Next Story




