Kanipakam: కాణిపాకంలో ధ్వజారోహణంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు!
Kanipakam: కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. తొమ్మిది రోజుల పాటు కొనసాగనున్న వేడుకలు.
Kanipakam: కాణిపాకంలో ధ్వజారోహణంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు!
Kanipakam: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో అంగరంగంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు ధ్వజారోహణముతో ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం స్వామి వారి ధ్వజస్తంభం దగ్గర ఆలయ అర్చకులు వేద పండితులు వేదమంత్రాలతో పూజలు నిర్వహించి ధ్వజ పతాకాన్ని ఎగురవేశారు.
ఈ ధ్వజ పతాకం ఎగరవేసే కార్యక్రమంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు పాల్గొని స్వామివారిని ఆశీర్వదిస్తాడని ప్రతీక గా చెప్పుకుంటారని ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్ తెలిపారు. ఈరోజు నుండి తొమ్మిది రోజులు ఆలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవముగా నిర్వహించి చివరి రోజు ధ్వజ అవరోహణ కార్యక్రమముతో ఆలయ బ్రహ్మోత్సవాలు ముగిస్తాయన్నారు.తర్వాత ప్రత్యేక బ్రహ్మోత్సవాలు ఆలయ ఉభయ దారుల చేత నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు. ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి తీర్థప్రసాదాలు ఆలయ అర్చకులు అందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆలయ చైర్మన్ మనీ నాయుడు దేవస్థానం బోర్డు సభ్యులు పాల్గొన్నారు.




