Chittoor: కాణిపాకంలో వైభవంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు!

Chittoor: చిత్తూరు జిల్లా కాణిపాకంలో నేటి నుంచి అక్టోబర్ 4 వరకు బ్రహ్మోత్సవాలు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Sept 2026 12:02 PM IST
Chittoor
X

Chittoor: కాణిపాకంలో వైభవంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు!

Chittoor: చిత్తూరుజిల్లా కాణిపాకంలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ్లి నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు కాణిపాక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

ఇవాళ ప్రభుత్వం తరపున స్వామివారికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. కాగా వినాయక చవితి పర్వదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్