Chittoor: కోలాహలంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు
Chittoor: చిత్తూరు జిల్లా వి.కోటలో గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు అభిమానుల మధ్య అత్యంత కోలాహలంగా జరిగాయి.
Chittoor: కోలాహలంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు
Chittoor: ప్రపంచo నలుదిశలా తెలుగువాడి ఖ్యాతిని వ్యాపింపజేసిన ప్రసిద్ధ నటసింహం, తెలుగు చిత్రపరిశ్రమలో చరిత్ర సృష్టించిన నటసార్వభౌమ నందమూరి తారకరమారావు నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సంబరాలు అంబరాన్నoటాయి. వికోటలో బుధవారం ఉదయం శ్రీవీరాంజనేయ స్వామి ఆలయంలో జూ. ఎన్టీఆర్ పేరిట ప్రత్యేక అభిషేకాదులు జరిపించారు.
అనంతరం స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రి ప్రాగణంలో జూ.ఎన్టీఆర్ అభిమానుల రక్తదానంతో ప్రారంభమైన జన్మదిన వేడుకలు ఆసాంతం ఉత్సాహంగా సాగాయి. ఎన్టీఆర్ విగ్రహం వద్ద భారీ కేక్ కట్ చేసి అభిమానులు ఒకరికొకరు తినిపించుకున్నారు. కాగా వారం రోజులుగా కొన్ని ప్రాంతాల్లో వరుసగా అన్నదాన కార్యక్రమాలు చేశారు.చివరగా అంబేద్కర్ సర్కిల్ నుంచి ఎగువ చెక్పోస్ట్ దాకా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాన్ సూరి, శ్రీకాంత్, మునిరాజ్, శరత్, నిఖిల్, శివ, హరి, యుసాఫ్, మంజునాథ్, రోషన్ , అశ్వాత్, హేమాద్రి, యాష్, సురేష్, జాకిర్, వినోద్, పవన్ మంజు,సుబ్బు ,హరీష్ తదితరులు పాల్గొన్నారు.




