Sri Sathya Sai District: జర్నలిస్టు హత్యపై ఓ.డి చెరువులో నిరసన
Sri Sathya Sai District: జగన్ మోహన్ రెడ్డి హత్యపై ఓ.డి చెరువులో జర్నలిస్టులు నిరసన చేపట్టి నిందితులకు కఠిన శిక్షలు కోరారు.
Sri Sathya Sai District
Sri Sathya Sai District: ఆంధ్రజ్యోతి జర్నలిస్టు జగన్ మోహన్ రెడ్డి హత్య ఘటనపై ఓ.డి చెరువులో జర్నలిస్టులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే మండల అధ్యక్షుడు షేక్ షాజహాన్, కార్యదర్శి రంగప్ప ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై మల్లికార్జున్ రెడ్డిలకు వినతిపత్రం అందజేశారు. హత్యపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
వక్తలు మాట్లాడుతూ, అవినీతి అంశాలపై వార్తలు ప్రచురించిన నేపథ్యంలో జర్నలిస్టు జగన్ మోహన్ రెడ్డిని దారుణంగా హత్య చేయడం ప్రజాస్వామ్యంపై దాడిగా పేర్కొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.
మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించడంతో పాటు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో వసంతం భుజంగరావు, బుద్ధల గోపీనాథ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఫిరోజ్, మహేశ్వర్ రెడ్డి, శ్రీనివాసులు, ఫయాజ్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.




