Madanapalle: జనసేన నేత ముస్తూరు రామ్మోహన్ బర్త్‌డే

Madanapalle: మదనపల్లెలో జనసేన నేత, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ముస్తూరు రామ్మోహన్ జన్మదిన వేడుకలు.

Srinivasulu, Madanapalle
Published on: 2 Jun 2026 10:02 AM IST
Madanapalle
X

Madanapalle: జనసేన నేత ముస్తూరు రామ్మోహన్ బర్త్‌డే

మదనపల్లె: జనసేన పార్టీ నాయకులు, చేనేత కార్మిక యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, మదనపల్లె హౌస్‌పెట్ చైర్మన్ ముస్తూరు రామ్మోహన్ జన్మదిన వేడుకలను తోట కళ్యాణ్, అడపా సురేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ రామ్మోహన్ చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారని కొనియాడారు.

కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి వారికి అండగా నిలిచారని పేర్కొన్నారు. ఇలాంటి సేవాభావం కలిగిన రామ్మోహన్‌కు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృప ఎల్లప్పుడూ ఉండాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో అజయ్, నరేంద్ర, దీపక్ సింగ్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story