Madanapalle: జగనన్న కాలనీలో నరకప్రాయం మోకాలి లోతు గుంతలతో అధ్వాన్నంగా రోడ్లు

Madanapalle: మదనపల్లె పట్టణ శివారు అమ్మ చెరువు మిట్ట సమీపంలోని జగనన్న కాలనీ ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారింది.

Srinivasulu, Madanapalle
Published on: 14 May 2026 12:32 PM IST
Madanapalle
X

Madanapalle: జగనన్న కాలనీలో నరకప్రాయం మోకాలి లోతు గుంతలతో అధ్వాన్నంగా రోడ్లు

మదనపల్లె: పట్టణ శివారులోని అమ్మ చెరువు మిట్ట సమీపంలో ఉన్న జగనన్న కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని మోకాలి లోతు గుంతలతో ప్రమాదకరంగా మారింది. ఈ రహదారిపై ప్రతిరోజూ ప్రయాణించే వాహనదారులు, కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగనన్న కాలనీలో సుమారు నాలుగు వేలకుపైగా ఇళ్లు ఉండగా, సరైన రహదారి, వీధులు, మురుగునీటి కాలువల వంటి మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ శివారు ప్రాంతం కావడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story