Kanipakam: కాణిపాకం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు!
Kanipakam: కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఈవో పెంచల కిషోర్, జిల్లా అధికారులు. భద్రత, క్యూలైన్లపై సమీక్ష.
Kanipakam: కాణిపాకం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు!
Kanipakam: శ్రీ స్వామి వారి దేవస్థానం 2026 వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్ , మరియు జిల్లాలోని వివిధ శాఖల యంత్రాంగంతో క్యూలైన్లు, బస్టాండు, కాణిపాకం ఆలయం నందు, మరియు కాణిపాకం గ్రామంలో పర్యటించి విస్తృత తనిఖీలు నిర్వహించడం జరిగింది, ఎలక్ట్రికల్, మరియు అగ్ని ప్రమాదాలపై, షాపుల వారికి మరియు సిబ్బందికి అవగాహనలు తెలపడం జరిగింది, గ్రామం మాడా విధులలో తిరిగి తనిఖీలు నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు, చిత్తూరు అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి, సిఐ శ్రీధర్ నాయుడు, ఐరాల ఎమ్మార్వో, ఆర్&బి, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, మండల అధికారులు, కాణిపాకం ఎస్ఐ నరసింహులు, ఇంజనీరింగ్ శాఖ ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.
Next Story




