Nagari: నగరి మీదుగా తమిళనాడుకు అక్రమ ఇసుక అర్ధరాత్రి పోలీసుల మెరుపు దాడి!

Nagari: చిత్తూరు జిల్లా నగరి మీదుగా తమిళనాడుకు అక్రమ ఇసుక తరలింపు. అర్ధరాత్రి తనిఖీల్లో రెండు టిప్పర్లు పట్టివేత, మరో రెండింటి పరారీ.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 11 Aug 2026 10:29 AM IST
Nagari
X

Nagari: నగరి మీదుగా తమిళనాడుకు అక్రమ ఇసుక అర్ధరాత్రి పోలీసుల మెరుపు దాడి!

Nagari: చిత్తూరు జిల్లా నుంచి తమిళనాడుకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ లారీలపై పోలీసులు కొరడా ఝుళిపించారు.అర్ధరాత్రి సమయంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా,అతివేగంగా వెళ్తున్న నాలుగు టిప్పర్ లారీలు కనిపించడంతో వాటిని ఆపేందుకు ప్రయత్నించారు.

అయితే పోలీసుల ఆపే ప్రయత్నాలను పట్టించుకోకుండా రెండు టిప్పర్ లారీలు అతివేగంగా తమిళనాడు వైపు దూసుకెళ్లాయి.మరో రెండు టిప్పర్ లారీలను పోలీసులు అడ్డుకుని తనిఖీలు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.ఎలాంటి బిల్లులు,రవాణా అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

దీంతో రెండు టిప్పర్ లారీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు,వాటి యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.రాత్రి వేళల్లో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు గస్తీని మరింత ముమ్మరం చేస్తామని తెలిపారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story