Chintoor: చింతూరు టీడీపీలో కొత్త జోష్: మండలాధ్యక్షుడిగా జమాల్ ఖాన్
Chintoor: చింతూరు టీడీపీ మండలాధ్యక్షుడిగా డాక్టర్ జమాల్ ఖాన్ నియామకంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. రానున్న స్థానిక ఎన్నికలపై పసుపు పార్టీ గురి పెట్టింది.
Chintoor: చింతూరు టీడీపీలో కొత్త జోష్: మండలాధ్యక్షుడిగా జమాల్ ఖాన్
చింతూరు: చింతూరు టిడిపి కార్యకర్తలలో నూతన ఉత్సాహం పెల్లుబికింది.ఇన్నేళ్లుగా కాస్త నైరాస్యంలో ఉన్న టిడిపి కార్యకర్తలలో జమాల్ ఖాన్ రాకతో ఫుల్ జోష్ కనబడుతుంది. రానున్న ఎంపీటీసీ జడ్పిటిసి సర్పంచ్ ఎన్నికలలో టిడిపి బలం ఏంటో చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు.
ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, జమాన్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్ చింతూరు మండల టిడిపి అధ్యక్షుడిగా అధిష్టానం నియమించడం పట్ల టిడిపి శ్రేణులలో ఉత్సాహం రెట్టింపు అయింది. జమాల్ ఖాన్ అటు వైద్య సేవలో, ఇటు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవలు అందించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
జమాల్ ఖాన్ ప్రాణాపాయంలో ఉన్న వారికి వైద్యం అందించి ప్రాణాలు నిలబెట్టిన సందర్భాలు కోకొల్లలు. వైద్య సేవలో జమాల్ ఖాన్ చింతూరు ఏజెన్సీలోని ప్రజలలో ప్రాణదాతగా ఓ ప్రత్యేక ముద్ర సంపాదించుకున్నారు. వైద్య వృత్తి కాకుండా జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆపదలో ఉన్న వారిని తానున్నానంటూ ఆదుకుంటూ ప్రజలలో మన్ననలు పొందారు.
ఆపదలో ఉన్నానంటూ ఏ పేదవాడు అయినా జమాల్ ఖాన్ దగ్గరకు వస్తే అధైర్య పడొద్దు అండగా నేనుంటా అంటూ తక్షణమే తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ జమాల్ ఖాన్ పేరు ప్రఖ్యాతలు గడించారు .విలీన మండలాల్లో గోదావరి శబరి వరదల వలన ముంపువాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కోట్ల రూపాయల నిత్యవసర సరుకులు కొనుగోలు చేసి ముంపు వాసులకు జమాల్ ఖాన్ అందించారు. ప్రతి పేదవాడికి కూడు గుడ్డ గూడు ఉండాలి అని జమాల్ ఖాన్ అంటుంటారు.
పేదవాడి కోసం నిరంతరం ఏదో ఒక రూపంలో పేదవాడికి అండగా నిలుస్తూ జమాల్ ఖాన్ ప్రజలకు మరింత చేరవుతున్నారు.మారుమూల గ్రామాల్లో మంచినీటి సౌకర్యం లేదని తెలిస్తే తక్షణమే అక్కడ బోర్ ఏపించి ఆ గ్రామస్తుల దాహార్తిని జమాల్ ఖాన్ తీర్చుతున్నారు.గూడు చెదిరిపోయిన పేదవారికి సిమెంట్ రేకులు,ఇనుప పైపులు,సిమెంట్,కొంత ఆర్థిక సాయం అందించి పేదవాడికి ఆపద్బాంధవుడిగా జమాల్ ఖాన్ నిలుస్తున్నారు.
జమాల్ ఖాన్ అటు వైద్య సేవలో ఇటు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు మంచి సేవ చేస్తూ జమాల్ ఖాన్ మన్ననలు పొందుతున్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు చింతూరు ఏజెన్సీలో జమాల్ ఖాన్ చేస్తున్న సేవల కారణంగా చింతూరులో పసుపు జెండా రెపరెపలాడడం ఖాయమని టిడిపి శ్రేణులు భావిస్తున్నారు.
చింతూరు మండలంలో మొత్తంగా 18 పంచాయతీలు, 12 ఎంపీటీసీ స్థానాలు,ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో చింతూరు మండలంలో 18 పంచాయతీలలో 18 పంచాయతీలు వైఎస్ఆర్ సీపీ జెండా ఎగరవేసి తన హావాను ప్రదర్శించింది. అలాగే 12 ఎంపీటీసీ స్థానాలలో టిడిపి ఒకటి, సిపిఎం రెండు, ఇండిపెండెంట్ గా ఒకరు గెలవగా మిగిలిన 8 ఎంపీటీసీ స్థానాలను వైఎస్ఆర్సిపి గెలుపొందడం జరిగింది.
జడ్పిటిసి స్థానాన్ని సైతం వైఎస్ఆర్సిపి గెలుపొంది చింతూరు మండలంలో రాజకీయంగా తమకు పోటీ లేదని నిరూపించుకుంది.రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ జెండా చింతూరులో ఎగురుతుందోనని పలువురిలో ఉత్కంఠ నెలకొంది.రానున్న ఎన్నికల్లో చింతూరు మండలంలో ఏ పార్టీ తన హావాను ప్రదర్శిస్తుందో ఎదురు చూడాల్సిందే.




