Madanapalle: మదనపల్లె కాంగ్రెస్ ఆఫీస్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!

Madanapalle: మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీనియర్ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్.

Srinivasulu, Madanapalle
Updated on: 15 Aug 2026 4:08 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె కాంగ్రెస్ ఆఫీస్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండాకు వందనం చేసి దేశ స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా షేక్ రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితంగానే మనం నేడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

యువత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జాతీయ పతాకానికి గౌరవం తెలిపారు. అనంతరం స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story