Chittoor: జిల్లా అభివృద్ధిలో మీడియా పాత్ర కీలకం – కలెక్టర్ సుమిత్ కుమార్
Chittoor: చిత్తూరు ప్రెస్ క్లబ్‌ను సందర్శించిన కలెక్టర్ సుమిత్ కుమార్. ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడంలో మీడియా పాత్రను ప్రశంసించిన కలెక్టర్.
Chittoor: జిల్లా అభివృద్ధిలో మీడియా పాత్ర కీలకం – కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు: జిల్లా అభివృద్ధిలో మీడియా పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. శనివారం చిత్తూరు ప్రెస్‌క్లబ్‌ను సందర్శించిన ఆయన, జర్నలిస్టులతో సమావేశమై వారి సమస్యలు, పలు అంశాలపై చర్చించారు.
ప్రభుత్వ పథకాల అమలులో లోపాలు, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని కలెక్టర్ ప్రశంసించారు.
పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు, జర్నలిస్టుల రక్షణకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.సమాజ హితం, ప్రజా సమస్యల పరిష్కారం, తప్పులను సరిదిద్దేలా పత్రికా రచన కొనసాగాలని జర్నలిస్టులకు సూచించారు.
ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్ నాయకులు కలెక్టర్‌ను దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రమేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి కాళేశ్వర్‌రెడ్డి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు లోకనాథం, సీనియర్ జర్నలిస్టులు, విలేకరులు పాల్గొన్నారు.




