Chowdepalle: వర్షాలు కురవాలని గంగమ్మకు గ్రామస్తుల కుంభాభిషేకం

Chowdepalle: చౌడేపల్లి మండల కేంద్రంలో వర్షాలు కురవాలని శ్రీ నడివీధి గంగమ్మకు ప్రత్యేక పూజలు, కుంభాభిషేకం నిర్వహించిన గ్రామస్తులు.

MAHESH, PUNGANOOR
Published on: 23 July 2026 9:14 PM IST
Chowdepalle
X

Chowdepalle: వర్షాలు కురవాలని గంగమ్మకు గ్రామస్తుల కుంభాభిషేకం

చౌడేపల్లి: చౌడేపల్లి మండల కేంద్రంలో వెలసిన శ్రీ నడివీధి గంగమ్మకు వర్షాలు కురవాలని గ్రామస్తులు కుంభాభిషేకం నిర్వహించారు. గ్రామస్తులు ఉదయం నుండి అమ్మవారికి చల్ల పోశారు.

వర్షాకాలం ప్రారంభమైన వర్షాలు కురవకపోవడంతో అమ్మవారికి వర్షాలు కురిపించాలని గ్రామస్తులు కుంభాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి చల్ల తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు.

ఉదయం నుంచి అమ్మవారికి ఉమాభిషేకం నిర్వహించి సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story