Chowdepalle: చౌడేపల్లిలో ఘనంగా పవన్ కళ్యాణ్ బర్త్‌డే రోగులకు పండ్ల పంపిణీ!
Chowdepalle: చౌడేపల్లిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ, బస్టాండ్ వద్ద కేక్ కటింగ్ సంబరాలు.
Chowdepalle: చౌడేపల్లిలో ఘనంగా పవన్ కళ్యాణ్ బర్త్‌డే రోగులకు పండ్ల పంపిణీ!
Chowdepalle: రాష్ట్ర డిసిఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు మండల కేంద్రమైన చౌడేపల్లిలో మండల నాయకులు గందోడి చరణ్ భూదేవి హోటల్ మురళి ఆధ్వర్యంలో ఉదయాన్నే స్థానిక ఆరోగ్య కేంద్రం నందు పాలు పండ్లు బ్రెడ్డు వంటివి రోగులకు పంపిణీ చేశారు.
అనంతరం పుంగనూరు నియోజకవర్గ నాయకులు కోలా సోమశేఖర్ పుంగనూరు సింగిల్ విండో అధ్యక్షుడు పగడాల రమణ సిరి వేలు చిన్న రాయల్ లు నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో బస్టాండ్ నందు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు.
డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి గత రెండు సంవత్సరాలుగా నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరు పాల్గొని జనసేన సత్తా చాటాలని వారు కోరారు అనంతరం అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు ఈ ఈ కార్యక్రమంలో ఇంకా నగేష్ నరేష్ లీలా కుమార్ నాగ్ రాఖీ పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




