Chittoor: ఎక్సైజ్ కమిషనరేట్ తరలింపును వ్యతిరేకిస్తూ వైసీపీ నిరసన
Chittoor: చిత్తూరు నుండి ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయాన్ని తిరుపతికి తరలించడాన్ని నిరసిస్తూ వైసీపీ ఇన్‌చార్జి విజయానందరెడ్డి ఆధ్వర్యంలో కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.
Chittoor: ఎక్సైజ్ కమిషనరేట్ తరలింపును వ్యతిరేకిస్తూ వైసీపీ నిరసన
చిత్తూరు: చిత్తూరులోని ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయాన్ని తిరుపతికి తరలించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ విజయానందరెడ్డి అన్నారు. కార్యాలయాన్ని చిత్తూరులోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కటమంచి లాయర్స్ కాలనీలోని ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ.. గతంలో కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయాన్ని తిరుపతికి తరలించిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు ఎక్సైజ్ కమిషనరేట్‌ను కూడా తరలించేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని విమర్శించారు. చిత్తూరు నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకుండా చూస్తానని హామీ ఇచ్చిన స్థానిక ప్రజాప్రతినిధి.. కార్యాలయాల తరలింపు అంశంపై ఎందుకు మౌనం వహిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు రెండు నెలల ముందు కార్యాలయాల తరలింపునకు జీవో ఇచ్చినప్పటికీ, దాన్ని ఉపసంహరించేందుకు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ప్రయత్నాలు చేశామని విజయా




