Chittoor: బక్రీద్ వేళ అక్రమ పశు రవాణా చేస్తే జైలుకే.. ఎస్పీ హెచ్చరిక!
Chittoor: చిత్తూరు జిల్లాలో బక్రీద్ పండుగ సందర్భంగా సామాజిక సామరస్య పరిరక్షణకు కఠిన చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు.
Chittoor: బక్రీద్ వేళ అక్రమ పశు రవాణా చేస్తే జైలుకే.. ఎస్పీ హెచ్చరిక!
Chittoor: చిత్తూరు జిల్లాలో బక్రీద్ పండుగ సందర్భంగా శాంతిభద్రతలు,సామాజిక సామరస్య పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఆవులు, దూడలు తదితర నిషేధిత పశువుల అక్రమ రవాణా, చట్టవిరుద్ధ వధింపులు, అనుమతులు లేకుండా తరలింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా సరిహద్దులు, చెక్‌పోస్టులు, ప్రధాన రహదారుల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
గతంలో ఇలాంటి కేసుల్లో పాల్గొన్న వారిపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని, అవసరమైతే బౌండ్ ఓవర్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో వదంతులు, మత సామరస్యానికి భంగం కలిగించే పోస్టులు పెట్టిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ప్రజలు చట్ట నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో బక్రీద్ జరుపుకోవాలని, ఎక్కడైనా అక్రమ రవాణా లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.




