Chittoor: చిత్తూరు జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా శివయ్య ఎన్నిక
Chittoor: చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వి. శివయ్య, కార్యదర్శిగా నరేష్ బాబు ఏకగ్రీవ ఎన్నిక. 21 పదవులకు ఒక్కొక్క నామినేషన్ దాఖలు.
Chittoor: చిత్తూరు జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా శివయ్య ఎన్నిక
చిత్తూరు: చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా శివయ్య ఏకగ్రీవం 21 పదవులకు ఒక్కొక్క నామినేషన్.. ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నిక | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందుంటాం: శివయ్య.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చిత్తూరు జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లా అధ్యక్షుడిగా వి. శివయ్య, జిల్లా కార్యదర్శిగా నరేష్ బాబు ఎన్నికయ్యారు. శనివారం చిత్తూరు నగరంలోని హరికృష్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
జిల్లా కార్యవర్గం పదవీకాలం ముగియడంతో నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.ఎన్నికల అధికారిగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజ్‌కుమార్ వ్యవహరించగా..అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా కడప జిల్లా అధ్యక్షులు రఘురాం నాయుడు బాధ్యతలు నిర్వర్తించారు.సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
21 పదవులకు ఏకగ్రీవ ఎన్నిక....నూతన కార్యవర్గంలోని 21 పదవులకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఎన్నికల ప్రక్రియ ఏకగ్రీవంగా పూర్తయిందని ఎన్నికల అధికారి రాజ్‌కుమార్ ప్రకటించారు. పోటీ లేకుండా ఎన్నికలు జరగడంతో ప




