Chittoor: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గురజాల
Chittoor: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిత్తూరులోని పలు ఆలయాల్లో ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
Chittoor: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గురజాల
చిత్తూరు: శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించిన పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ పాల్గొన్నారు. చిత్తూరు నగర పరిధిలోని పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉదయం చిత్తూరు నగరంలోని హై రోడ్డులో ఉన్న శ్రీ గోపాలకృష్ణ ఆలయం, శ్రీనగర్ కాలనీలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఉత్సవ నిర్వాహకులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌ను ఘనంగా సత్కరించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో కూటమి పార్టీల నాయకులు కాజూరు బాలాజీ, వెంకటేష్ యాదవ్, కాండ్ర రమేష్, రాజేష్ కుమార్ రెడ్డి, బాలసుబ్రమణ్యం యాదవ్, నరేష్, వరలక్ష్మి, ఈశ్వరరావు, యశ్వంత్, కోలా కిరణ్




