Chittoor: సీఎం చంద్రబాబును కలిసిన చిత్తూరు ఎమ్మెల్యే జగన్ మోహన్!

Chittoor: చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కలిశారు.

Chandra Sekhar, Chittoor
Published on: 29 July 2026 8:09 AM IST
Chittoor
X

Chittoor: సీఎం చంద్రబాబును కలిసిన చిత్తూరు ఎమ్మెల్యే జగన్ మోహన్!

Chittoor: చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరుతూ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మంగళవారం రాత్రి అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా చిత్తూరు నియోజకవర్గంలో చేపట్టాల్సిన ప్రధాన అభివృద్ధి పనులకు సంబంధించిన వినతిపత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. నీవా నదిపై రీటైనింగ్ వాల్ నిర్మాణం, యూనివర్సిటీ ఏర్పాటుకు తదుపరి చర్యలు, నగరంలోని ప్రధాన రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల కేటాయింపు,అడవిపల్లి పైప్‌లైన్ పనులు, రిజర్వాయర్ పనులను వేగవంతం చేయడం వంటి అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ముఖ్యమంత్రిని కోరారు. అభివృద్ధి ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎమ్మెల్యేతో పాటు పాల్గొన్నారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor

Next Story