Chittoor: తేనెబండలో రూ.30.80 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం!

Chittoor: చిత్తూరు తేనెబండ లో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ రూ.30.80 లక్షల సీసీ రోడ్లను ప్రారంభించారు. హయగ్రీవ స్కూల్ రోడ్డుకు జీజేఎం రోడ్డుగా నామకరణం చేశారు.

Chandra Sekhar, Chittoor
Published on: 25 July 2026 5:22 PM IST
Chittoor
X

Chittoor: తేనెబండలో రూ.30.80 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం!

చిత్తూరు: చిత్తూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతంగాచేపడుతున్నామని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు అండగా నిలవాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కోరారు.శనివారం నగరపాలక సంస్థ పరిధిలోని తేనెబండ ప్రాంతంలో రూ.30.80 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లు, సిమెంట్ కాలువలను ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,నగరంలోని అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.నగర సమగ్ర అభివృద్ధి కోసం ప్రధాన రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధికి తోడ్పడుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.స్థానిక అంగన్‌వాడీ కేంద్రానికి టెలివిజన్‌ను బహుకరించారు.

హయగ్రీవ పాఠశాల రోడ్డుకు "జీజేఎం రోడ్"గా నామకరణం చేశారు.అనంతరం ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి,ఈ కార్యక్రమంలో చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, మాజీ మేయర్ అముద, కూటమి నాయకులు రాజేష్ కుమార్ రెడ్డి, పచ్చయప్ప.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor

Next Story