Chittoor: ఎవరినీ కించపరచలేదు.. క్షమాపణలకూ సిద్ధం ఎమ్మెల్యే జగన్మోహన్
Chittoor: రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టొద్దు. కన్నడ ప్రజలను కించపరచలేదు.. భావన కలిగి ఉంటే క్షమాపణలకూ సిద్ధమేనన్న ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్.
Chittoor: ఎవరినీ కించపరచలేదు.. క్షమాపణలకూ సిద్ధం ఎమ్మెల్యే జగన్మోహన్
చిత్తూరు: రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య, మతాల మధ్య , రాష్ట్రాల మధ్య కొంతమంది చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని... ఏ ఒక్క కన్నడ వారిని కించపరిచే విధంగా మాట్లాడలేదు అని అన్నారు.
ఇటీవల ఒక సమావేశంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ బెంగళూరు, చెన్నై నగరాలలో పాలించేవారు సగం మంది చిత్తూరు వారేనని చెప్పాను ఈ విషయాన్ని కొంతమంది కన్నడ వాళ్లు అభ్యంతరం తెలిపారని వార్తలు రావడం.
దీనిపై ఎమ్మెల్యే స్పష్టం చేస్తూ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాల మధ్య చిచ్చుపట్టే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. నేను ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడే ప్రజలు నన్ను ఎంతో గానో ఆదరించారన్నారు.
నేను ఏ ఒక్క ప్రాంతం వారిని కించపరిచే విదంగా మాట్లాడా లేదని అలా అనిపించిన పక్షంలో నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధం.




