Chittoor: పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ జన్మదిన వేడుకలు!
Chittoor: చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలిగిరి మురళీమోహన్ 48వ జన్మదిన వేడుకలు ఐరాలలో ఘనంగా జరిగాయి. కాణిపాక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
Chittoor: పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ జన్మదిన వేడుకలు!
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం
ఘనంగా పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలిగిరి మురళీమోహన్ జన్మదిన వేడుకలు.
కాణిపాక ఆలయంలో పూజలు పుట్టినరోజు సందర్భంగా పూజలు నిర్వహించిన శాసన సభ్యులు
పూతలపట్టు శాసనసభ్యులు. డాక్టర్ కలిగిరి మురళీమోహన్ 48వ జన్మదిన వేడుకలను. ఐరాల క్రాస్ బాలాజీ కళ్యాణ మండపం నందు నియోజకవర్గం ప్రజలతోపాటు, చిత్తూరు తిరుపతి నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే మురళీమోహన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజల అభిమానంతోనే పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్నానని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు, నారా లోకేష్ బాబు. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నాకు తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. పూతలపట్టు నియోజకవర్గం లో ఐదు మండలాల ప్రజల హృదయాలలో నిలిచిపోయినందుకు చాలా గర్వకారణంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులతో పాటు, అని మండలాల తెలుగుదేశం పార్టీ కన్వీనర్లు పాల్గొన్నారు.




