Chittoor: వసంత్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
Chittoor: చిత్తూరులో గుండెపోటుతో మృతి చెందిన చెరుకూరి వసంత్ కుమార్ కుటుంబాన్ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు.
Chittoor: వసంత్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
చిత్తూరు: ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన చెరుకూరి వసంత్ కుమార్ కుటుంబాన్ని చిత్తూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పరామర్శించారు.
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారితో కలిసి వసంత్ కుమార్ కుటుంబ సభ్యులను కలిసిన మంత్రి, వారి దుఃఖంలో పాలుపంచుకుని కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు. వసంత్ కుమార్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, వసంత్ కుమార్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కుటుంబ సభ్యులకు ఏ అవసరం వచ్చినా పార్టీ నాయకత్వం అందుబాటులో ఉంటుందని, వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు షణ్ముఖ రెడ్డి, పార్లమెంట్ కార్యదర్శి సునీల్ చౌదరి, చుడా చైర్మన్ కటారి హేమలత, కాజూరి బాలాజీ, మాజీ మార్కెట్ చైర్మన్ తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.




