Chittoor: నేలపాలవుతున్న తోతాపురి.. చంద్రగిరి మామిడి రైతుల కన్నీరు!

Chittoor: ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో మామిడి రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు.

VENKATA RAMANA, CHANDRAGIRI
Published on: 29 May 2026 3:00 PM IST
Chittoor
X

Chittoor: నేలపాలవుతున్న తోతాపురి.. చంద్రగిరి మామిడి రైతుల కన్నీరు!

Chittoor: పల్ప్ ఫ్యాక్టరీలు ఓపెన్ చేయకపోవడంతో తోతాపురి మామిడి నేల పాలవుతున్న పరిస్థితి. మామిడి పంట కు సంవత్సర కాలం పాటు చెట్లకు మందులు, ఎరువులు వేసిన కనీస ధర లభించడం లేదని కూలీలు, ట్రాక్టర్ బాడుగ కూడా గిట్టుబాటు కావడం లేదంటున్న మామిడి రైతులు. అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మామిడి రైతులను ఆదుకోవాలని కోరుతున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు. గతంలో చిత్తూరు అంటే చెరుకు, మామిడి పంటకు పేరు ఉండేదని క్రమంగా చెరుకు ఫ్యాక్టరీలు చెరుకు రైతులు అంతరించిపోయారు. అదే విధంగా మామిడి రైతుల కూడా అంతరించిపోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ప్రభుత్వం సహకరించి మామిడి రైతులకు చేయూత అందించాలని డిమాండ్.

VENKATA RAMANA, CHANDRAGIRI

VENKATA RAMANA, CHANDRAGIRI

Next Story