Chittoor: అందత్వ నివారణే లక్ష్యంగా జైన్ సంఘ్ ఉచిత కంటి శిబిరం!
Chittoor: చిత్తూరు నగరంలో జైన్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.
Chittoor: అందత్వ నివారణే లక్ష్యంగా జైన్ సంఘ్ ఉచిత కంటి శిబిరం!
చిత్తూర్: పేద ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలను అందించి అందత్వాన్ని నివారించాలనే లక్ష్యంతో జైన్ సంఘ్ ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.
ఈ శిబిరంలో మొత్తం 210 మంది కంటి పరీక్షలు చేయించుకోగా, వారిలో 99 మంది కంటి శస్త్రచికిత్సకు ఎంపికయ్యారు.శిబిరంలో పాల్గొన్న రోగులకు ఎస్వీ అరవింద్ కంటి ఆసుపత్రి వైద్య బృందం సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించింది.
గత నెల ఇదే శిబిరం ద్వారా కంటి శస్త్రచికిత్స చేయించుకున్న 67 మందికి ఈ సందర్భంగా రివ్యూ పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.ఈ సందర్భంగా జైన్ సంఘ్ ప్రతినిధి సుభాష్ జైన్ మాట్లాడుతూ, సేవా దృక్పథంతో ప్రతి నెల నాలుగో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కంటి శస్త్రచికిత్సకు ఎంపికైన వారికి ఆపరేషన్ ఖర్చులు, లెన్స్ చార్జీలు, రాకపోకల బస్సు సౌకర్యం, భోజనం, వసతి వంటి అన్ని సదుపాయాలను ఉచితంగా కల్పిస్తున్నామని తెలిపారు.




