Chittoor: సాంప్రదాయంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి చిత్తూరు ఉత్సవ కమిటీ!

Chittoor: చిత్తూరులో వినాయక చవితి వేడుకలపై గణేశ ఉత్సవ కమిటీ సమావేశం. మండపాలకు ఉచిత విద్యుత్, పోలీసుల అనుమతులు, కట్టమంచి చెరువు వద్ద నిమజ్జనంపై వినతి.

Chandra Sekhar, Chittoor
Published on: 29 Aug 2026 7:53 PM IST
Chittoor
X

Chittoor: సాంప్రదాయంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి చిత్తూరు ఉత్సవ కమిటీ!

Chittoor: వినాయక చవితి వేడుకలను సాంప్రదాయంగా నిర్వహించుకోవాలని చిత్తూరు నగర గణేశ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రామభద్ర అన్నారు. శనివారం చిత్తూర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులకు పోలీసులు సకాలంలో అనుమతులు జారీ చేయాలన్నారు.

గత ఏడాదిలాగే ఈసారి విద్యుత్ శాఖ వారు వినాయక మండపాలకు విద్యుత్ సరఫరాను ఉచితంగా అందజేయాలన్నారు. మండపాల వద్ద సినిమా పాటలు కాకుండా భక్తి పాటలు మాత్రమే లౌడ్ స్పీకర్ లో పెట్టాలని సూచించారు.కట్టమంచి చెరువు వద్ద నిమజ్జన వేడుకలకు నగరపాలక యంత్రాంగం,ఇతర శాఖలు సమన్వయం చేసుకొని ఏర్పాటు చేయాలని కోరారు.

కట్టమంచి చెరువు వద్ద నిమజ్జనం కోసం నగర పాలక్ అధికారులు నీటిని నింపాలని కోరారు. నిమజ్జనానికి ముందుగా జల శుద్ధి కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు 9 రోజులలోనే ఉత్సవాలు పార్టీ చేయాలనీ, అలా కాకుండా నెల పొడవునా చేయడం సరికాదని సూచించారు.ఈ సమావేశంలో కమిటీ సభ్యులు వెంకటేష్, శ్రీనివాసులు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor

Next Story