Chittoor: దస్తావేజు లేఖరుల నిరసన.. 10 రోజులు పెన్ డౌన్ స్ట్రైక్!

Chittoor: రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుకు నిరసనగా చిత్తూరులో దస్తావేజు లేఖరులు 10 రోజుల పాటు పెన్ డౌన్ స్ట్రైక్ చేపట్టారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 20 July 2026 4:08 PM IST
Chittoor
X

Chittoor: దస్తావేజు లేఖరుల నిరసన.. 10 రోజులు పెన్ డౌన్ స్ట్రైక్!

చిత్తూరు: రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను రద్దు చేయాలని కోరుతూ చిత్తూరు రిజిస్టర్ ఆఫీస్ దస్తావేజు లేఖరులు సోమవారం నుండి విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా దస్తావేజు లేఖరుల ప్రెసిడెంట్ శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న రిజిస్టర్ ఆర్ఎస్కే వల్ల తామే కాకుండా ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు తీవ్ర నష్టాల పాలయ్యే అవకాశం ఉందన్నారు.

అందుకొరకే 10 రోజులపాటు పెన్డౌన్ స్ట్రైక్ చేస్తున్నామని ఆయన తెలిపారు.ప్రభుత్వం తీసుకొచ్చిన 369 జీవో కారణంగా రిజిస్టర్ శాఖ కూడా ప్రైవేట్ పరం చేసే అవకాశం ఉందన్నారు.దీని కారణంగా దస్తావేజు లేఖరులే కాకుండా,ప్రజల ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోతుందని ఆయన పేర్కొన్నారు దస్తావేజులకు భద్రత ఉండదని అలాగే ప్రభుత్వ శాఖను ప్రైవేటు పరం చేయాల్సిన అవసరం ఏముందని వారు ప్రశ్నించారు.

ప్రైవేట్ పరం చేయడం వల్ల ప్రతి దస్తావేజు రిజిస్ట్రేషన్కు ఆర్ఎస్కే లకు ₹2,000 కట్టాల్సి వస్తుందని దీనివల్ల ప్రభుత్వం ఆదాయానికి గండి పడుతుందని అలాగే దస్తావేజు లేఖరుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూవడమే గాక దస్తావేజుల భద్రతకు ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నారని వారు పేర్కొన్నారు.

ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న ఈ ఆర్ఎస్కే దస్తావేజు రిజిస్ట్రేషన్ లను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో మరింత ఉధృతంగా పోరాటాలు సాగిస్తామని ఆయన పేర్కొన్నారు అనంతరం జిల్లా రిజిస్టార్ వినతిపత్రం సమర్పించారు. ఈ ధర్నా కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆనంద్ కుమార్,రవి,రామచంద్ర,రూపేష్ ,చిరంజీవి, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story