Chittoor: అవయవ దానంపై చైతన్యం పెరగాలి చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్!
Chittoor: ఆర్గాన్, బాడీ డొనేషన్‌పై ప్రజల్లో అవగాహన పెరగాలి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. అపోలో మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభం.
Chittoor: అవయవ దానంపై చైతన్యం పెరగాలి చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్!
Chittoor: ఆర్గాన్, బాడీ డొనేషన్‌పై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. ప్రపంచ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
రాష్ట్రంలో సుమారు 4,800 మంది కిడ్నీ మార్పిడి కోసం ఎదురుచూస్తుండగా,ఏడాదికి కేవలం 350 మందికే ట్రాన్స్‌ప్లాంటేషన్ జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.ప్రజలు స్వచ్ఛందంగా అవయవ దానానికి ముందుకు రావాలని కోరారు.అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.అపోలో విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అవయవ దానం ప్రాధాన్యతపై నినాదాలు, ప్లకార్డులతో ప్రజలకు అవగాహన కల్పించారు. అపోలో నాలెడ్జ్ సిటీ నుంచి మురకంబట్టు సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది.




