Chittoor: అపోలో నాలెడ్జ్ సిటీ విద్యార్థుల తల్లిదండ్రులకు హెల్త్ చెకప్‌ లపై భారీ రాయితీ

Chittoor: అపోలో నాలెడ్జ్ సిటీ విద్యార్థుల తల్లిదండ్రులకు ₹15,000 విలువైన హెల్త్ చెకప్‌లు ₹4,000 కే లభ్యం. వౌచర్ ఆవిష్కరించిన విసి డా. నితిన్ నాగర్కర్.

Chandra Sekhar, Chittoor
Published on: 23 July 2026 4:56 PM IST
Chittoor
X

Chittoor: అపోలో నాలెడ్జ్ సిటీ విద్యార్థుల తల్లిదండ్రులకు హెల్త్ చెకప్‌ లపై భారీ రాయితీ

చిత్తూరు: అపోలో నాలెడ్జ్ సిటీ విద్యార్థుల తల్లిదండ్రులకు ఆరోగ్య పరీక్షలపై భారీ రాయితీ అపోలో నాలెడ్జ్ సిటీలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల కోసం అపోలో హాస్పిటల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ (AHERF) ప్రత్యేక స్టూడెంట్స్ ఫ్యామిలీ డిస్కౌంట్ వౌచర్ పథకాన్ని ప్రారంభించింది.

ఈ పథకం కింద రూ.15,000 విలువైన సమగ్ర ఆరోగ్య పరీక్షలను కేవలం రూ.4,000కే అందించనున్నారు. ఈ వౌచర్‌ను అపోలో యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డా. నితిన్ ఎం. నాగర్కర్ ఆవిష్కరించి, తొలి వౌచర్లను విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేశారు.ఈ ప్రత్యేక ఆరోగ్య ప్యాకేజీలో రక్త పరీక్షలు, మధుమేహ నిర్ధారణ, మూత్రపిండాలు, కాలేయం, గుండె సంబంధిత పరీక్షలు, ఛాతీ ఎక్స్‌రే, ఉదర అల్ట్రాసౌండ్, ఈసీజీ (ECG), గుండె ప్రతిధ్వని పరీక్ష (2D Echo) వంటి కీలక పరీక్షలు ఉన్నాయి.

అదనంగా,ఇతర వైద్య పరీక్షలపై 15 శాతం రాయితీ కూడా అందించనున్నారు. ఓచర్ జారీ చేసిన తేదీ నుంచి మూడు నెలలపాటు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఆరోగ్య పరీక్షలను అపోలో క్లినిక్, చిత్తూరు మరియు అపోలో ఆస్పత్రి, ఆరగొండలో నిర్వహించనున్నారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor

Next Story