Chandragiri: స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం కోసం జనసైనికులు శ్రమించాలి

Chandragiri: చంద్రగిరిలో స్థానిక ఎన్నికలకు జనసేన శ్రేణులు సిద్ధం కావాలి. 116 పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో కూటమి విజయం సాధించేలా కృషి చేయాలి.

VENKATA RAMANA, CHANDRAGIRI
Published on: 10 Aug 2026 7:35 AM IST
Chandragiri
X

Chandragiri: స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం కోసం జనసైనికులు శ్రమించాలి

చంద్రగిరి: రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో జనసైనికులు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ దేవర మనోహర్ పిలుపునిచ్చారు ఆదివారం చంద్రగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఆరు నెలల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కునేందుకు ప్రతి కార్యకర్త సైనికుల పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని 116 పంచాయతీలు 96 ఎంపిటిసి స్థానాలు.6 జడ్పిటిసి స్థానాలు కూటమి అభ్యర్థులు విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రతి కార్యకర్త ప్రజలతో నిరంతరం మమేకం అవ్వాలని కోరారు ఇకపై ఓటర్లు జాబితాలో అక్రమాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరిని ఓటు హక్కు కల్పించే కొత్త వాటర్ నమోదుపై జనసైనికులు ప్రత్యేక దృష్టి సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.

VENKATA RAMANA, CHANDRAGIRI

VENKATA RAMANA, CHANDRAGIRI

Next Story