Kanipakam: వరసిద్ధి వినాయకుడికి ఘనంగా పుష్ప కావళ్ల సమర్పణ!

Kanipakam: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులు భక్తిశ్రద్ధలతో పుష్ప కావళ్లతో ఊరేగింపుగా వచ్చి స్వామివారికి సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు.

VASU, PUTTALAPATTU
Published on: 14 Sept 2026 7:48 PM IST
Kanipakam
X

Kanipakam: వరసిద్ధి వినాయకుడికి ఘనంగా పుష్ప కావళ్ల సమర్పణ!

కాణిపాకం: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి పుష్పకావిళ్ళతో మొక్కుబడులు తీర్చుకున్న భక్తులు. ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున కాణిపాక అనుబంధ దేవాలయమైన వరదరాజ స్వామి ఆలయంలో పుష్పకావులకు భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి మాడవీధుల గుండా స్వామివారి నామస్మరణతో ఆలయము చేరుకుని స్వామివారికి పుష్పకావిల్లు చెల్లించారు.

రాష్ట్రం నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి పుష్పకావిల్లు చెల్లింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆలయ చైర్మన్ మణి నాయుడు ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU