Punganur: బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం ₹87.20 లక్షలు!

Punganur: బోయకొండ గంగమ్మ ఆలయంలో 37 రోజులకు ₹87.20 లక్షల హుండీ ఆదాయం లభ్యమైందని ఆలయ ఈఓ, ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు.

MAHESH, PUNGANOOR
Published on: 20 Aug 2026 4:45 PM IST
Punganur
X

Punganur: బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం ₹87.20 లక్షలు!

Punganur: బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ ఆదాయం 87.20లక్షలు

ప్రముఖ శక్తి క్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయానికి హుండీ ద్వారా 37 రోజులకు గాను 87,20,769 లు ఆదాయంగా సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఉప కమీషనర్ ఏకాంబరం తెలిపారు

గురువారం ఆలయం లో హుండీ లెక్కింపును నిర్వహించారు

బంగారు 23-005 గ్రాములు, వెండి 250-012 గ్రాములు

విదేశీ కరెన్సీ

బ్యాంక్ ఆఫ్ తజనియ 5000 షిల్లింగ్ 2, 2000 షిలింగ్స్ 3, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ 1 డాలర్, బ్యాంక్ ఆఫ్ కెనడా 10 డాలర్స్ నోట్స్ 5, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఓమన్ 100 బైసా 2నోట్స్, సౌదీ అరేబియా మైనారిటీ ఏజెన్సీ 1రియల్ నోట్స్ 7, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ట్రీనిడాడ్, టొబాగో 10డాలర్స్ నోట్స్ 10, థాయిలాండ్ 20 థాయ్ బాత్ 1,

అన్నదానము వద్ద గల హుండీ వలన రూ. 12,873/-లు మరియు శ్రీ రణభేరి గంగమ్మ దేవస్థానము ఆదాయం రూ. 65,851.00 వచ్చినవి. సదరు లెక్కింపునకు దేవస్థాన ఉప కమీషనరు & కార్యనిర్వహణాధికారి J. ఏకాంబరం, దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీ S. శశి కుమార్ గారు, చౌడేపల్లి పోలీస్ సిబ్బంది, ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, చౌడేపల్లి వారు మరియు దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story