Yerpedu: ఏర్పేడు వ్యాసాశ్రమ వివాదాలపై కోలా ఆనంద్ ప్రెస్ మీట్!
Yerpedu: ఏర్పేడు వ్యాసాశ్రమంలో జరుగుతున్న అక్రమాలు, ఆస్తుల విక్రయంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ విలేకరుల సమావేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Yerpedu: ఏర్పేడు వ్యాసాశ్రమ వివాదాలపై కోలా ఆనంద్ ప్రెస్ మీట్!
Yerpedu: ఏర్పేడు వ్యాసాశ్రమం పై జరుగుతున్న వివాదాలపై బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలాఆనంద్ విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ మాట్లాడుతూ..
సనాతన ధర్మాలకు పునాదిగా కొనసాగుతున్న వ్యాసాశ్రమం నేడు పూర్తిగా అవినీతి అక్రమాలకు చోటు చేసుకుంటుందని,,
వ్యాసాశ్రమం చెందిన ఆస్తులను ఆశ్రమానికి చెందిన కొందరు వ్యక్తులు అక్రమంగా విక్రయించుకుంటూ స్వలాభాలు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యాసాశ్రమం హిఠాధిపతులుగా పరిపూర్ణానంద స్వామి అలియాస్ రెడ్డి కొనసాగేందుకు తమకు ఎటువంటిఆక్షేపణ లేదని, వారి సోదరుడు శివరాంరెడ్డి పీఠాధిపతులుగా కొనసాగేందుకు తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలియజేశారు.
ఏర్పేడు వ్యాసాశ్రమం సంబంధించిన కమిటీని పూర్వ విద్యార్థులు, నియోజకవర్గ పెద్దలు , వివిధ పీఠాధిపతులతో కలిసినా నూతన కమిటీని ఏర్పాటుచేసి, ఏర్పేడు వ్యాసాశ్రమానికి పునర్ వైభవం తీసుకురావాలని తెలియజేశారు .
పై సమస్యలను త్వరలోనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లి ఏర్పేడు వ్యాసాశ్రమం పునర్ వైభవంతో సనాతన ధర్మాలను కొనసాగించేలా కార్యాచరణ చేపడతామని సందర్భంగా తెలియజేశారు.




