Puthalapattu: చంద్రబాబు, కరువు కవల పిల్లలు.. వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూమన!
Puthalapattu: చంద్రబాబు అధికారంలోకి వస్తే కరువు రావడం ఖాయమని వైసీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు.
Puthalapattu: చంద్రబాబు, కరువు కవల పిల్లలు.. వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూమన!
Puthalapattu: చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా తోబుట్టువుల కరువును కూడా తీసుకొస్తారని వైఎస్ఆర్సిపి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు, పూతలపట్టు నియోజకవర్గం కేంద్రమైన పూతలపట్టులో జరిగిన జగనన్న మా నమ్మకం నువ్వే కార్యక్రమం పూతలపట్టు వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ సుధాకర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలకు నాయకులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా హామీనీ అమలు చేసిన దాఖలు లేవన్నారు , నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో వాటర్ మెన్ గా అధికారులు చెప్పడం హాస్యాస్పద మన్నారు.
ఆయన పొగిడించుకోవడం తప్ప ఏ ఒక్క రోజు కూడా ఆయన ఒక ఎకరం కూడా సాగునీరు కూడా ఇవ్వలేద న్నారు.
తెలుగుదేశం పార్టీపై ప్రజలకు విశ్వాసం పూర్తిగ సన్నగిల్లిందని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని స్థానిక సమస్యల ఎన్నికల్లో వైసిపి అన్ని స్థానాలను చేసుకోవడం ఖాయం అన్నారు. స్థానిక ఎన్నికల గెలుపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు ఐక్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు .
ఈ కార్యక్రమంలో పూతలపట్టు సమన్వయకర్త సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి, రాష్ట్ర వైఎస్ఆర్సిపి మేధావుల సంఘ సలహాదారులు పూతలపట్టు జగదీశ్వర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ కుమార్ రాజా, ఐదు మండలాల కన్వీనర్లు , నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




