Punganur: జీవో 102 పై రాష్ట్రవ్యాప్త పోరాటానికి బోడె రామచంద్ర పిలుపు!
Punganur: మెడికల్, డెంటల్ అడ్మిషన్ల కోసం తెచ్చిన జీవో నం.102ను తక్షణమే రద్దు చేయాలని భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు పుంగనూరులో డిమాండ్ చేశారు.
Punganur: జీవో 102 పై రాష్ట్రవ్యాప్త పోరాటానికి బోడె రామచంద్ర పిలుపు!
పుంగనూరు: ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్, డెంటల్ కళాశాలల అడ్మిషన్ల కోసం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసిన జీవో నం.102ను తక్షణమే ఉపసంహరించుకోవాలని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) జాతీయ అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ జీవో అమలుతో ముఖ్యంగా బీసీ విద్యార్థులతో పాటు రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో నిపుణుల కమిటీ సిఫారసుల ఆధారంగా అమల్లోకి వచ్చిన జీవో నం.151 ప్రకారం గత ఆరేళ్లుగా అడ్మిషన్ ప్రక్రియ ఎలాంటి వివాదాలు లేకుండా కొనసాగుతోందని తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని పక్కనపెట్టి, కొత్తగా జీవో 102ను తీసుకురావడం ద్వారా ప్రభుత్వం బీసీ విద్యార్థుల హక్కులను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు.
2018లో కూడా బీసీలకు నష్టం కలిగించే నిర్ణయాలను ప్రజా ఉద్యమంతో వెనక్కి తీసుకునేలా చేశామని గుర్తు చేసిన రామచంద్ర యాదవ్, ఇప్పుడు కూడా బీసీల హక్కుల విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వం వెంటనే జీవో నం.102ను రద్దు చేసి, పాత జీవో నం.151 ప్రకారమే మెడికల్, డెంటల్ అడ్మిషన్లు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీసీ, రిజర్వేషన్ విద్యార్థులతో కలిసి బీసీవై పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.




