Bangarupalyam: 'తిరంగా యాత్ర'.. బైక్ నడిపిన ఎమ్మెల్యే మురళీ మోహన్!
Bangarupalyam: ఘనంగా 'తిరంగా యాత్ర' బైక్ ర్యాలీ. స్వయంగా బైక్ నడిపి, జాతీయ జెండా పట్టి ముందుండి నడిపించిన పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీ మోహన్.
Bangarupalyam: 'తిరంగా యాత్ర'.. బైక్ నడిపిన ఎమ్మెల్యే మురళీ మోహన్!
Bangarupalyam: బంగారుపాళ్యం మండల కేంద్రంలో ఘనంగా "తిరంగా యాత్ర" బైక్ ర్యాలీ.. స్వయంగా బైక్ నడిపి ముందుండి నడిపించిన గౌరవ పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీ మోహన్ గారు!
రాష్ట్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు, పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలో ఈరోజు "తిరంగా యాత్ర" బైక్ ర్యాలీ అత్యంత ఉత్సాహభరితంగా మరియు విజయవంతంగా జరిగింది.
గౌరవ పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీ మోహన్ గారు స్వయంగా బైక్ నడుపుతూ, చేతిలో జాతీయ జెండాను పట్టుకుని ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొని ముందుండి నడిపించారు. దేశభక్తి స్ఫూర్తిని చాటుతూ సాగిన ఈ ర్యాలీలో బంగారుపాళ్యం మండల పార్టీ అధ్యక్షులు ఎన్.పి.ధరణి ప్రసాద్, పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ఉత్సాహవంతులైన కార్యకర్తలు మరియు భారీ సంఖ్యలో పాఠశాల, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.




