Madanapalle: బెల్లే రెడ్డి ప్రసాద్ నివాసంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం పూజలు!
Madanapalle: మదనపల్లెలో కురబ-కురమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లే రెడ్డి ప్రసాద్ నివాసంలో వరలక్ష్మీ వ్రతం పూజలు. కుటుంబ సమేతంగా ప్రత్యేక ప్రార్థనలు.
Madanapalle: బెల్లే రెడ్డి ప్రసాద్ నివాసంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం పూజలు!
Madanapalle: కురబ-కురమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లే రెడ్డి ప్రసాద్ నివాసంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పూజలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లే రెడ్డి ప్రసాద్‌తో పాటు ఆయన సతీమణి, కురవంక ఎంపీటీసీ హారతి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.
ఈ సందర్భంగా బెల్లే రెడ్డి ప్రసాద్ మాట్లాడుతూ.. వరలక్ష్మీ వ్రతం పూజలు నిర్వహించడం ద్వారా కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం కలగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
Next Story




