Madanapalle: సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వాడాలి!

Madanapalle: సమాచారాన్ని క్షణాల్లో చేరవేసే శక్తి సోషల్ మీడియాకు ఉందని, దానిని బాధ్యతాయుతంగా వాడాలని మదనపల్లె సెమినార్‌లో పయ్యావుల ప్రవీణ్ అన్నారు.

Srinivasulu, Madanapalle
Published on: 6 Sept 2026 12:38 PM IST
Madanapalle
X

Madanapalle: సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వాడాలి!

Madanapalle: సమాచారాన్ని క్షణాల్లో ప్రజలకు చేరవేయడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోందని ఏపీడబ్ల్యూజే అనంతపురం జిల్లా అధ్యక్షులు పయ్యావుల ప్రవీణ్ అన్నారు. ఆదివారం మదనపల్లెలోని శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సోషల్ మీడియా ప్రభావం’ అనే సెమినార్‌కు ఆయన హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా పయ్యావుల ప్రవీణ్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రజల జీవితాల్లో అంతర్భాగంగా మారిందన్నారు. ఏ సమాచారం అయినా క్షణాల్లో ప్రజలకు చేరవేసే శక్తి సోషల్ మీడియాకు ఉందని తెలిపారు.

అయితే ఈ వేదికను బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియాను సమాజానికి మేలు చేసే విధంగా ఉపయోగించాలని, అసత్య ప్రచారాలు, అపోహలు, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే సమాచారాన్ని ప్రచారం చేయకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని సూచించారు.

సోషల్ మీడియాను చెడుకు ఏమాత్రం ఉపయోగించకుండా మంచి, ప్రజా ప్రయోజనకరమైన సమాచారాన్ని విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు. సెమినార్‌లో జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు, పలువురు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story