Chittoor: చిత్తూరులో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవం!
Chittoor: చిత్తూరు జిల్లా కేంద్రంలో ఏపీయూడబ్ల్యూజే (APUWJ) 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
Chittoor: చిత్తూరులో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవం!
చిత్తూరు: చిత్తూరు జిల్లా కేంద్రంలో APUWJ ఆవిర్భావ దినోత్సవాన్ని పాత్రికేయులు ఘనంగా నిర్వహించారు. APUWJ యూనియన్ 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా కార్యక్రమాల్లో భాగంగా పట్టణ నిరాశ్రయుల కేంద్రంలో వృద్ధులకు అన్నదానం చేశారు.
అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్‌ను కలిసి జర్నలిస్టుల సంక్షేమం,ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు,పెన్షన్లు, ప్రమాద బీమా తదితర అంశాలపై వినతిపత్రం అందజేశారు. APUWJ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కేక్ కట్ చేసి జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీ ఏర్పాటుపై పది రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో APUWJ జిల్లా అధ్యక్షుడు ఎం. లోకనాథన్, ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణతో పాటు ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ బాబు కాళేశ్వర్ రెడ్డి తో పాటు ఏపీడబ్ల్యూజే కార్యనిర్వాహక కార్యదర్శి కేఎం అశోక్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు మురహరి రెడ్డి , ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ (APUWJ )జిల్లా అధ్యక్షులు శివకుమార్, సీనియర్ పాత్రికేయులు సుభాష్ ,శివప్రసాద్, మహేష్, బాల సుందరం , నరేష్, షకీల్, రాజేష్, చంద్ర ప్రకాష.




