Kanipakam: దేవాదాయ శాఖ మంత్రివర్యులకు బ్రహ్మోత్సవాల ఆహ్వానం!
Kanipakam: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆహ్వానించారు.
Kanipakam: దేవాదాయ శాఖ మంత్రివర్యులకు బ్రహ్మోత్సవాల ఆహ్వానం!
Kanipakam: విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
కాణిపాకంలో అత్యంత వైభవంగా జరగనున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల అధికారిక ఆహ్వాన పత్రికను, స్వామివారి తీర్థప్రసాదాలను మంత్రిగారికి అందజేసి, ఈ దివ్య వేడుకలకు విచ్చేయాల్సిందిగా డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో కాణిపాకం ఆలయ చైర్మన్ మణి నాయుడు గారు, ఐరాల మండల అధ్యక్షులు హరిబాబు నాయుడు గారు, పోల్ మేనేజ్‌మెంట్ కోఆర్డినేటర్ గిరి నాయుడు గారు, ఆలయ ఈవో పెంచల కిషోర్ గారు, ఇతర ముఖ్య నేతలు మరియు అర్చకులు పాల్గొన్నారు.
Next Story




