Annamayya: తెల్లవారుజామునే 'ఎన్టీఆర్ భరోసా'.. వరిగలో పండుగ వాతావరణం!
Annamayya: అన్నమయ్య జిల్లా వరిగలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పండుగలా జరిగింది. తెల్లవారుజామునే TDP మండల అధ్యక్షుడు సుధాకర్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు
Annamayya: తెల్లవారుజామునే 'ఎన్టీఆర్ భరోసా'.. వరిగలో పండుగ వాతావరణం!
రాయచోటి, అన్నమయ్య జిల్లా
ఇంటింటికీ ‘ఎన్టీఆర్ భరోసా’.. వరిగ గ్రామంలో పండుగ వాతావరణం
తెల్లవారుజామునే లబ్ధిదారుల ఇళ్లకు చేరుకుని పెన్షన్లు పంపిణీ చేసిన టిడిపి మండల అధ్యక్షుడు సుధాకర్
అన్నమయ్య జిల్లా రాయచోటి రూరల్ మండలం వరిగ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న "ఎన్టీఆర్ భరోసా" పెన్షన్ పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయం ఉత్సాహభరితంగా జరిగింది. రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, టిడిపి యువ నాయకుడు మౌర్య రెడ్డి ఆదేశాల మేరకు టిడిపి మండల అధ్యక్షుడు సుధాకర్ ఉదయం 6 గంటల నుంచే గ్రామంలోని లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు.వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర అర్హులైన లబ్ధిదారులకు వారి ఇంటి వద్దకే పెన్షన్లు అందజేసి ప్రభుత్వం సంక్షేమంపై చూపుతున్న చిత్తశుద్ధిని వివరించారు. పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా ఇంటి వద్దకే అందజేయడం వల్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.గ్రామంలో పెన్షన్ పంపిణీ సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కొనియాడారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు ఇబ్బంది పడకుండా ఇంటి వద్దకే పెన్షన్ అందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ ప్రజలకు ఎంతో ఊరటనిస్తున్నాయని తెలిపారు.
టిడిపి మండల అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్ అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే టిడిపి లక్ష్యమని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేర్చేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని పారదర్శకంగా ప్రజలకు చేరవేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. లబ్ధిదారులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు.




