Annamayya: కలెక్టర్ ఆదేశాలున్నా న్యాయం జరగలేదని బాధితుల ఆవేదన!
Annamayya: అన్నమయ్య జిల్లా కలికిరిలో కలెక్టర్ ఆదేశాలను సైతం రెవెన్యూ అధికారులు బేఖాతరు చేస్తున్నారంటూ బాధితులు మదనపల్లె ప్రెస్ క్లబ్లో ఆందోళన వ్యక్తం చేశారు.
Annamayya: కలెక్టర్ ఆదేశాలున్నా న్యాయం జరగలేదని బాధితుల ఆవేదన!
Annamayya: అన్నమయ్య జిల్లా కలికిరిలో భూ వివాదంపై జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ రెవెన్యూ అధికారులు న్యాయం చేయలేదని బాధితులు మదనపల్లె ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. కలికిరికి చెందిన డాక్టర్ షమీ, అశ్వక్, తస్మియా మాట్లాడుతూ తమ తండ్రి వల్లీ అహ్మద్‌కు చెందిన భూమిని తాము ఉద్యోగరీత్యా బయట ప్రాంతాల్లో ఉండగా ఇతరులు ఆక్రమించుకున్నారని తెలిపారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా విచారణ అనంతరం భూమి తమదేనని కలెక్టర్ నిర్ధారించారని పేర్కొన్నారు. అనంతరం సమగ్ర దర్యాప్తు చేసి న్యాయం చేయాలని తహసీల్దార్‌కు ఆదేశాలు ఇచ్చినా ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదని వాపోయారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.
Next Story




