Madanapalle: 14 ఏళ్లుగా రాని భూపరిహారం.. అధికారులకు మహిళ ఫిర్యాదు!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఎం. చంద్రమ్మ అనే మహిళ తమ భూమి నష్టపరిహారం కోసం గత 14 ఏళ్లుగా ఎదురుచూస్తున్నట్లు HNSS అధికారులకు ఫిర్యాదు చేశారు.
Madanapalle: 14 ఏళ్లుగా రాని భూపరిహారం.. అధికారులకు మహిళ ఫిర్యాదు!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం వలసపల్లి గ్రామానికి చెందిన ఎం. చంద్రమ్మ గురువారం హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. తన కుటుంబ ఆస్తులకు సంబంధించిన వివాదం గత 14 ఏళ్లుగా పరిష్కారం కాకపోవడంతో న్యాయం చేయాలని కోరారు. వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం, వలసపల్లి సమ్మర్ స్టోరేజ్ నిర్మాణం కోసం తమ కుటుంబానికి చెందిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పటికీ, అందుకు సంబంధించిన నష్టపరిహారం పూర్తిస్థాయిలో అందలేదని ఆమె ఆరోపించారు.
రెవెన్యూ శాఖ జారీ చేసిన ఉత్తర్వులు, రికార్డులు తనకు అనుకూలంగా ఉన్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి పెండింగ్‌లో ఉన్న నష్టపరిహారాన్ని అందజేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ చేనేత రాష్ట్ర కార్యదర్శి అడపా సురేంద్ర మాట్లాడుతూ,
బాధితురాలు పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్యకు పరిష్కారం లభించలేదని మండిపడ్డారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి నష్టపరిహారం అందజేసి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కలెక్టర్ కార్యాలయం ఫిర్యాదును స్వీకరించి పరిశీలిస్తామని తెలిపింది.




