Chowdepalli: మలేషియా ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్‌గా జగదీష్ రాయల్
Chowdepalli: మలేషియా దేశానికి ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్‌గా అన్నమయ్య జిల్లా చౌడేపల్లికి చెందిన శ్రీరామ జగదీష్ రాయల్ నియామకం. హర్షం వ్యక్తం చేసిన ప్రవాసాంధ్రులు.
Chowdepalli: మలేషియా ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్‌గా జగదీష్ రాయల్
చౌడేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం వివిధ దేశాలలో నివసిస్తున్న ప్రవాస ఆంధ్రుల అభ్యున్నతికి సంక్షేమం కోసం ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్లను నియమించింది రెండవ జాబితాలో అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి కి చెందిన శ్రీరామ గోపాల్, ప్రభావతమ్మ దంపతుల కుమారుడు శ్రీరామ జగదీష్ రాయల్ ఉద్యోగరీత మలేషియాలో స్థిరపడ్డాడు.
గత కొన్ని సంవత్సరాలుగా మలేషియా ఆంధ్ర అసోసియేషన్ ఏర్పాటుచేసి ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు ఒక్కటిగా ఏర్పడి ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉత్తమ రైతు ఉత్తమ జర్నలిస్టులు మరియు వివిధ రంగాల వారితోపాటు మన ప్రజా ప్రతినిధులను మలేషియా దేశానికి ఆహ్వానించి వారందరినీ ఘనంగా సత్కరించి అవార్డులను అందజేస్తున్నారు.
మలేషియా దేశంలో నివసిస్తున్న ప్రవాస ఆంధ్రులకు అక్కడి ఇండియన్ ఎంబసీ తో సమన్వయం చేసుకొని ప్రవాస ఆంధ్రుల సంక్షేమం కోసం సేవలందిస్తారని ఎన్ఆర్ఐ శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీ ఎన్నార్టీ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీ రవికుమార్ వేమూరు ఒక ప్రకటనలో తెలియజేశారు.
మలేషియా దేశంలోని మలేషియా ఆంధ్ర అసోసియేషన్ సభ్యులను ఏపీ ఎన్నార్టీ కోండిటర్లుగా ప్రభుత్వం నియమించడం ఆపై మరింత భారం తిరిగిందని మలేషియా ఆంధ్ర అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ జగదీష్ రాయల్ తెలియజేశారు.




