Naidupeta: నాయుడుపేట జూనియర్ సివిల్ కోర్టు వద్ద న్యాయవాదుల నిరసన!
Naidupeta: నాయుడుపేట కోర్టు వద్ద న్యాయవాదుల నిరసన. అనంతపురంలో లాయర్ పట్ల పోలీసుల ప్రవర్తనపై ఆగ్రహం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్.
Naidupeta: నాయుడుపేట జూనియర్ సివిల్ కోర్టు వద్ద న్యాయవాదుల నిరసన!
Naidupeta: తిరుపతి జిల్లా నాయుడుపేటలోని జూనియర్ సివిల్ కోర్టు వద్ద న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు, అనంతపురంలో ఓ న్యాయవాది పట్ల పోలీసులు దృశ్య ప్రవర్తించి అవమానించినందున అక్కడ అనంతపురం న్యాయవాదులు 15 గంటలు నిరాహార దీక్ష చేసిన తరువాత పోలీసులు తమ తప్పు తెలుసుకొని క్షమాపణలు చెప్పినందున అక్కడ జరిగిన న్యాయవాది పట్ల అవమానకర ప్రవర్తనను నిరసిస్తూ ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతుందని న్యాయవాదుల పట్ల పోలీసులు ఇలా ప్రవర్తించడం సమంజసం కాదని న్యాయవాదులను పోలీసులు గౌరవించడం వారి విధులలో భాగంగా ఉండాలని లాయర్ చంగయ్య తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించడం అవమానించడంతో సమానమని ఇలాంటి చర్యలను పోలీసులు వెంటనే మానుకోవాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో తెలియజేసిన న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలియపరిచారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా న్యాయవాదుల పట్ల వెంటనే వారి ఇబ్బందులను తెలుసుకొని వారికి న్యాయం జరిగే విధంగా ఈ చట్టాన్ని రూపొందించే చర్యలు తీసుకోవాలని ఇక మీదట పోలీసులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే న్యాయవాదులుగా సహించేది లేదని లాయర్ చంగయ్య ఈ సందర్భంగా తెలిపారు,




