Chittoor: చిత్తూరులో 59 మంది దివ్యాంగులకు ఉచిత స్కూటర్ల పంపిణీ!

Chittoor: చిత్తూరులో 59 మంది దివ్యాంగులకు ఉచిత మూడు చక్రాల స్కూటర్లను పంపిణీ చేసిన కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్.

Chandra Sekhar, Chittoor
Published on: 28 Aug 2026 6:24 PM IST
Chittoor
X

Chittoor: చిత్తూరులో 59 మంది దివ్యాంగులకు ఉచిత స్కూటర్ల పంపిణీ!

Chittoor: ప్రతిభకు వైకల్యం అడ్డు కాదని, పట్టుదలతో కృషి చేస్తే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని PGRS సమావేశ మందిరంలో జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో 59 మంది దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల స్కూటర్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు, సహాయక పరికరాలను అందిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక్కో వాహనం సుమారు రూ.1.20 లక్షల విలువైనదని, ఆన్‌లైన్ దరఖాస్తులు, సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసినట్లు తెలిపారు.

ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇప్పటికే జిల్లాలో సుమారు 4,000 మంది దివ్యాంగులకు వివిధ సహాయక పరికరాలను అందించినట్లు తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా దివ్యాంగులకు స్కూటర్లు, ట్రైసైకిళ్లు అందించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor

Next Story