Madanapalle: 3 ఏళ్ల చిన్నారి 'దక్షిత్' 79 కి.మీ స్కేటింగ్ రికార్డు యాత్ర!
Madanapalle: 3 ఏళ్ల చిన్నారి అనంత దక్షిత్ 79 కి.మీ స్కేటింగ్ ప్రపంచ రికార్డు యాత్రను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు చినబాబు, ఎస్పీ వెంకటాద్రి ప్రారంభించారు.
Madanapalle: 3 ఏళ్ల చిన్నారి 'దక్షిత్' 79 కి.మీ స్కేటింగ్ రికార్డు యాత్ర!
Madanapalle: కేవలం మూడేళ్ల చిన్నారి అనంత దక్షిత్ 79 కిలోమీటర్ల స్కేటింగ్‌తో ప్రపంచ రికార్డు సాధించే లక్ష్యంతో చేపట్టిన ప్రయత్నం శుక్రవారం మదనపల్లెలో ఘనంగా ప్రారంభమైంది. మదనపల్లె నుంచి కదిరి వరకు 79 కి.మీ. స్కేటింగ్ ప్రయాణాన్ని ఉదయం 6:30 గంటలకు అన్నమయ్య సర్కిల్, రింగ్‌రోడ్ వద్ద ప్రారంభించారు.
తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ కె. వెంకటాద్రి పచ్చజెండా ఊపి చిన్నారి దక్షిత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ అధికారులు, దేశభక్తులు, బిజెపి యువ నాయకులు సింహం శ్రీకాంత్, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని దక్షిత్‌కు ప్రోత్సాహం అందించారు. చిన్న వయసులోనే ప్రపంచ రికార్డు లక్ష్యంతో 79 కి.మీ. స్కేటింగ్ చేపట్టిన దక్షిత్‌ను పలువురు అభినందించారు. అతని ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.




